రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.20,444 కోట్ల పెట్టుబడులతో 26 కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల 56 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు-NH16 లింక్‌కు రూ.532 కోట్లు కేటాయించారు. అలాగే ‘ఏపీ ప్రిజన్స్’ ముసాయిదా బిల్లుపై కూడా చర్చించి ఆమోదం తెలిపారు.