WG: మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి (65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో జెట్టిపాలెం గ్రామానికి చెందిన పెద్దిరాజు (30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.