ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ ను ఎంపీడీవో వీరభద్రాచారి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయి వారి 100 రోజుల కార్యచరణ ప్రణాళికను గురించి అడిగి వారి ప్రిపరేషన్, వారి స్టడీ లెవెల్స్ పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని ఎంపీడీవో రుచి చూశారు.