TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలంలోని నాగపూర్లో మూడోవార్డు అభ్యర్థులు అర్చన, విజయలక్ష్మికి సమాన ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా విజయలక్ష్మి గెలుపొందారు. అలాగే, గౌరారం రెండో వార్డులో అభ్యర్థులు రాజేందర్, వెంకటయ్యకు సమాన మెజార్టీ వచ్చింది. ఎన్నికల అధికారులు డ్రా తీయగా.. వెంకటయ్య విజయం సాధించారు.