WGL: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొకటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట మండలంలోని రాందాన్ తండాలో BRS పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి వెంకన్న 50 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే, రాయపర్తి మండలం జేతురాం తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు స్వప్న 19 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.