E.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం ఇవ్వట్లేదని జేసీ మేఘస్వరూప్కు గురువారం వినపత్రం అందజేశారు. రెండేళ్ల గౌరవ వేతనం ఇప్పించాలని ఎంపీటీసీ సభ్యులు కోరారు. తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు పరశురామారావు, గజ్జరం MPTC చిన్నబ్బాయి, వేగేశ్వరపురం MPTC లక్ష్మణరావు పాల్గొన్నారు.