TG: చిత్తూరు జిల్లాలో MPP ఎన్నికలపై మాజీమంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నిండ్ర, విజయపురంలో అప్రజాస్వామికంగా గెలిచారని అన్నారు. ఆర్వోపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయపురం ఎంపీపీ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచారని ఆరోపించారు. అలాగే, పార్టీకి ద్రోహం చేసినవారికి బుద్ధి చెబుతామని రోజా హెచ్చరించారు.