E.G: జూన్ 2025 – డిసెంబర్ 2025 వరకు నిర్వహించిన IVRS Perception Feedback Analysisలో తూ.గో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 87.5% సానుకూల స్పందన నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ర్యాంకింగ్ జిల్లా వైద్య ఆరోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. మరింత ఉన్నత సేవలు అందించాలన్నారు.