NLR: ఇందుకూరుపేట మండలం వెలుగు కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న మధువర్తి సీనమ్మ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. గుండెల్లో నొప్పి రావడంతో హాస్పిటల్కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.