2026 సమ్మర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో పాటు.. ‘టాక్సిక్’, ‘ది ప్యారడైజ్’, ‘ధురంధర్ 2’, ‘డెకాయిట్’ చిత్రాలు అదే సమయంలో విడుదలవుతున్నాయి. దీంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోలో రిలీజ్ కోసం ఈ సినిమా ఆగస్టుకు పోస్ట్ పోన్ అయినట్లు టాక్.