WG: స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే ఏపీ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి ఏర్పాటైందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా శేషగిరిరావు అన్నారు. గురువారం భీమవరంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో మన వాటా 2 శాతం మాత్రమే ఉందని, రానున్న కాలంలో 10 శాతానికి పెంచాలని వివరించారు.