RR: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని 48 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గిరాయిగుట్ట తండా గ్రామ సర్పంచ్‌గా హరి నాయక్ విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.