MBNR: సర్పంచ్ ఎన్నికల తొలి విడత పూర్తైందని, రెండో విడత 14న జరగనున్నట్లు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గ్రామాభివృద్ధి కోరే, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు. నారాయణపేటలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం కనిపించడం బాధాకరమన్నారు. డబ్బులతో గెలిచిన నేతలకు అభివృద్ధిపై ఆసక్తి ఉండదని వ్యాఖ్యానించారు.