సత్యసాయి: YCP జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్టపర్తి అసెంబ్లీకి చెందిన సీనియర్ నేత అవుటాల రమణారెడ్డి ఎంపిక అయ్యారు. ఆయనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం తాజాగా ప్రకటించింది. రమణారెడ్డి ఎంపిక పట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.