అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అసోంకు చెందినవారిగా గుర్తించారు. కొండ ప్రాంతం కావడంతో మృతదేహాల వెలికితీత కష్టంగా మారింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.