ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఉట్నూర్ మండలం పిట్టగూడకు చెందిన మూతి గంగా (బాలింత), ఆమె పసికందు మృతి చెందారు. డెలివరీ కోసం ఈ నెల 9న రిమ్స్‌కు వచ్చిన గంగా శిల బుధవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో డెలివరీ చేసే క్రమంలో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇద్దరు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.