ASF: తిర్యాణి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దుతుదారును గెలిపిస్తే గ్రామస్థుల ఇంటి పన్ను 5ఏళ్ల వరకు తామే కడతామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిల్ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 10 హామీలతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. గెలిచిన అనంతరం గ్రామపంచాయతీని సుందరీకరణగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.