ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఈనెల 13న హైదరాబాద్(ఉప్పల్ స్టేడియం) వస్తున్నారు. ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా జరిగే మ్యాచ్లో ఆయన పాల్గొంటారు. ఈ ఈవెంట్కు రావాలని రాహుల్, ప్రియాంకను ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇది ప్రైవేట్ ఈవెంట్ అయినా.. ప్రభుత్వం పూర్తి సెక్యూరిటీ ఇస్తోందన్నారు. మెస్సీతో పాటు మ్యాచ్లో తానూ పాల్గొంటున్నట్లు సీఎం చెప్పారు.