GDWL: గట్టు మండలంలోని సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. బాసు హనుమంతు నాయుడు బలపరిచిన అభ్యర్థి బోయ తిమ్మప్ప ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై తిమ్మప్ప ఏకంగా 50 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితం వెలువడగానే తిమ్మప్ప అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.