WGL: వర్ధన్నపేట మండలంలోని అంబేద్కర్ నగర్లో 1వ వార్డు ఫలితాన్ని డ్రా ద్వారా నిర్ణయించారు. కాంగ్రెస్ మద్దతుదారురాలు బొక్కల రజనీకి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు 31 ఓట్లు రావడంతో సమాన ఫలితం నమోదైంది. దీంతో నియమాల ప్రకారం ఎన్నికల అధికారులు చిట్టీలు వేసి విజేతను నిర్ణయించారు. గోకల రూపకు అదృష్టం వరించి విజేతగా నిలిచింది.