WG: మాగంటి అన్నపూర్ణా దేవి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లను గురువారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. సుమారు 90 మంది విద్యార్థినులకు క్లబ్ నాయకులు అందచేశారు. క్లబ్ నెలా వారీ కార్యక్రమంలో భాగంగా ఈకార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు పేరిచర్ల మురళి తెలిపారు.