KRNL: ఆదోని నేషనల్ హైవే బైపాస్‌లోని రైల్వే బ్రిడ్జ్ సమీపంలో కర్ణాటక తుమకూరు రిజిస్ట్రేషన్ కారు, ఒక బైక్, పత్తి ట్రాక్టర్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ఐదుగురు, స్కూటర్ నడిపిన వ్యక్తి గాయపడ్డారు. అనంతరం అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.