AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అనిల్ చోక్రా (A49), వెంకటేష్ (A34) కోర్టును ఆశ్రయించారు. విజయవాడ జైల్లో తమకు పడుకోవడానికి మంచం వసతి కల్పించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.