KMM: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా, సీపీ సునీల్ దత్ పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.