ప్రకాశం: కంభంలోని ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ గురువారం పరిశీలించారు. పట్టణంలోని నందీశ్వర ట్రేడర్స్, సాయి విఘ్నేశ్వర ట్రేడర్స్, కళ్యాణి ట్రేడర్స్ షాపులో రికార్డులను, ఎరువులు, పురుగుమందు స్టాక్ వివరాలను పరిశీలించి డీలర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అమ్మకాలను స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.