SKLM: మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల 6 నెలల పెండింగ్ బిల్లులు, వంట కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.నాగమణి డిమాండ్ చేశారు. గురువారం డీఈవో రవి బాబుకు వినతి పత్రం అందజేశారు. ప్రతి నెలా 5వ తేదీలోపు బిల్లులు వేతనాలు చెల్లించాలని కోరారు.