AKP: ఏర్పాటు చేసిన సబ్ రేషన్ డిపోను మండల టీడీపీ అధ్యక్షుడు చించలపు పద్దు శుక్రవారం ప్రారంభించారు. వినియోగదారులకు బియ్యం, రాగులు, పంచదార అందజేశారు. గ్రామానికి చెందిన వినియోగదారులు శ్రీరాంపురం వెళ్లి రేషన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న కారణంగా ఇక్కడ ప్రత్యేకంగా సబ్ డిపో ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కే రమణ పాల్గొన్నారు.