KMM: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చింతకాని మండలంలో 89% పోలింగ్ నమోదైంది. మొత్తం 41,707 మంది ఓటర్లకు గాను, 37,028 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు గురువారం అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి కాసేపట్లో పలితాలు రానున్నాయి.