ATP: RTC జోన్ ఛైర్మన్ పూల నాగరాజు విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. గుత్తి, రాయదుర్గం బస్ స్టేషన్ల ఆధునికీకరణ పనులకు మంజూరు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, రాయదుర్గం డిపో నుంచి బెంగళూరు, విజయవాడలకు కొత్తగా వెన్నెల, సూపర్ లగ్జరీ సర్వీసులు నడపాలని వినతిపత్రం సమర్పించారు.