SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం తుర్కరాశి నగర్ గ్రామ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థిగా షాదుల్లా విజయం సాధించారు. ఈ విజయం పట్ల BRS నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.