TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన 567 గ్రామాల ఫలితాల్లో హస్తం పార్టీ 382 స్థానాలను కైవసం చేసుకుంది. BRS బలపరిచిన అభ్యర్థులు 85 చోట్ల విజయం సాధించారు. అలాగే, 87 గ్రామాల్లో ఇతరులు గెలుపొందారు. బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది.