ATP: గుత్తి మండలం చర్లపల్లి గ్రామంలోని చెన్రాయని బ్యాలెన్సీ రిజర్వాయర్ నుంచి గురువారం కాలువలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నీటిని విడుదల చేశారు. ముందుగా అధికారులు, రైతులతో కలిసి రిజర్వాయర్లో గంగపూజ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు చేరే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.