E.G: నల్లజర్ల మండలం దూబచర్ల శ్రీ సంఘమిత్ర విద్యాలయానికి మరో గర్వకారణం ఏర్పడింది. ఈ విద్యాలయానికి చెందిన 21 మంది విద్యార్థి, విద్యార్థినులు ప్రతిష్టాత్మక లీడ్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 రీజనల్ రౌండ్‌కు ఎంపికైనట్లు స్కూల్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. విద్యార్థులు కఠోర శ్రమ, నాణ్యమైన శిక్షణ ఫలితంగా ఈ విజయం సాధించారన్నారు.