కోనసీమ: యానాం దరియాలతిప్ప పరిసర ప్రాంతాలలో ONGC గ్యాస్ పైప్లైన్ లీకేజీ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో బాధిత ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష 59 వ రోజుకు చేరింది. అగ్నిప్రమాదం జరిగి నెలలు కావస్తున్నా సంబంధిత సంస్థ తమ దీక్షను పట్టించుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు.