ADB: గాదిగూడ మండలంలోని కుండి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు స్థానానికి ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పూసం బాదిరావు 19 ఓట్ల తేడాతో ప్రత్యర్థిగా ఉన్న CPM పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగారంపై గెలిచారు. దీంతో మొత్తం 6 వార్డులు ఉండగా.. 5 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 6వ వార్డు సభ్యురాలిగా జంగుబాయి గెలుపొందింది.