GNTR: తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డకు చెందిన ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అమరావతి–జొన్నలగడ్డ రోడ్డులో ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో క్వారీ కుంటలో పడింది. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.