ELR: ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ డార్మిటరీ భవనాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్మాణంలో చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత కాంట్రాక్టర్కు, అధికారులకు తగిన సూచనలు చేసారు