కృష్ణా: ఈనెల 15వ తేదీ లోగా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం జిల్లా కలెక్టర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి ఇవాళ చర్చించారు. ఈ నెల 17,18 తేదీల్లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.