NZB: వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తగుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. SI శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మంగలి సాయిలు నిజాంసాగర్ వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగుతూ, మత్తులోకి జారుకుని ఒక్కసారిగా పడి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.