KKD: ప్రత్తిపాడు మండలం వొమ్మంగిలో గ్రామంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2025 గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.