AP: మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇన్ఛార్జ్ మంత్రులే తన దృష్టికి తేవాలని ఆదేశించారు. ‘నేనే మీ పనితీరును రివ్యూ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలతో కలిసి స్థానిక సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలన్నారు. ముఖ్యంగా ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం కావాలని డెడ్లైన్ విధించారు.