ATP: రాయదుర్గంలో మురికినీటి కాలువల ఏర్పాటుకు రూ. 23 కోట్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. అమరావతిలో మంత్రిని కలిసి పట్టణ అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో కాలువల నిర్మాణం త్వరగా చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.