సత్యసాయి: హిందూపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ తెలిపారు. గురువారం చెత్త సేకరించడానికి మూడు ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను మురికి కాలువలో, రహదారుల్లో పడేయకండి అని తెలిపారు. చెత్తను ఆటోలకు అందించి పట్టణ పరిశుభ్రతకు కృషి చేయాలని కోరారు.