ప్రకాశం జిల్లా మెడికల్ ఆఫీసర్గా రేణుక గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు జిల్లా ఆరోగ్య కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ పదవిలో ఉన్న వెంకటేశ్వర్లు స్థానంలో రేణుక బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తానన్నారు.