GNTR: బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. బాల్యవివాహాల అనర్థాలు తల్లిదండ్రులు గుర్తించాలని, బాల్యవివాహాలు లేని సమాజమే పురోగతికి దారి తీస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (BVM B) వంద రోజుల ప్రచారంపై కలెక్టరేట్లో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.