CTR: కుప్పంలోని కడా కార్యాలయంలో అంగన్వాడీలకు 430 మొబైల్ ఫోన్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గురువారం పంపిణీ చేశారు. అంగన్వాడీలలో ప్రభుత్వ సేవలకు వినియోగపడేలా ఈ మొబైల్ ఫోన్లను అంగన్వాడి కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.