AP: రాష్ట్ర పత్తి రైతుల కష్టాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో వినిపించారు. జీరో అవర్లో మాట్లాడుతూ.. ‘మొంథా’ తుపాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్రం దృష్టికి తెచ్చారు. వర్షాలకు రంగు మారిన, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొనుగోలు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.