బంగారం ధరలు ఉదయం తగ్గి సాయంత్రానికి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.440 పెరిగి ఏకంగా రూ.1,30,750కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,850 వద్ద ఉంది. ఇక వెండి కిలో రూ.2,09,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్లు ఉండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.