CTR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ జిల్లా కార్యదర్శి ఈశ్వర మహేంద్ర, రాష్ట్ర కౌన్సిలర్ సదాశివరెడ్డి తెలిపారు. పులిచర్ల మండలంలో యూటీఎఫ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.