TG: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. KTR వేసిన పరువునష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్, నటి సమంత విడాకుల వ్యవహారంలో గతంలో KTRపై మంత్రి సురేఖ ఆరోపణలు చేశారని విమర్శలు వచ్చాయి.